HomeTelugu Trending'శాకుంతలం' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘శాకుంతలం’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Shakunthalam trailer needs to click at any cost

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, షూటింగు పూర్తిచేసుకుని చాలాకాలమే అయింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటూ వెళుతోంది. ఇక త్వరలోనే అన్ని పనులు పూర్తికానున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు నిన్న ఒక ప్రకటన చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు? ఎన్ని గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు? అనే విషయాలను తాజాగా వెల్లడించారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాదులోని ‘పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్’లో ఉదయం 10:30 గంటలకు జరపనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!