HomeTelugu Trendingషకీలా ఎమోషనల్ పోస్ట్

షకీలా ఎమోషనల్ పోస్ట్

Shakeela emotional post abo

షకీలా పేరు తెలియని వారు ఉండరు. షకీలా అంటే శృంగార చిత్రాలకు పెట్టింది పేరు. అడపా దడపా సినిమాలు చేస్తూ చాలాకాలం తర్వాత తాను సొంతంగా నటించి నిర్మించిన ఓ చిత్రాన్ని విడుదల చేసేందుకు నానా తంటాలు పడుతోంది. రెండేళ్లుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘లేడీస్ నాట్ అలౌడ్’ పేరుతో రూపొందించిన ఈ సినిమా ఎన్నో కష్టాలు పడి తీశామని అంటోంది షకీలా. 3 నెలల్లోనే సినిమాను పూర్తి చేసినా సెన్సార్ పూర్తికావడానికి ఏడాదిన్నరపైనే పట్టింది. ఈ సినిమా సెన్సార్ కోసం హైదరాబాద్, చెన్నై, బొంబాయి, ఢిల్లీకి కూడా వెళ్లాల్సి వచ్చిందని అంటోంది. సెన్సార్ పూర్తికాక విడుదల ఆగిపోయిందని చెప్పింది. అయితే ఈ సినిమాను డిజిటలైజ్ చేసి ఆన్ లైన్‌లో విడుదల చేయొచ్చు అని తెలిసింది. ఈ సినిమాను సెన్సార్ చేయకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తున్నాం. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావడానికి ప్రయత్నిస్తే లాక్ డౌన్ వల్ల అనుమతి లభించలేదు.

లేడీస్ నాట్ అలౌడ్ సినిమా కోసం నా ఆస్తులన్నిటినీ అమ్మేసి పెట్టుబడిగా పెట్టాను. ఈ సినిమాను చూసి నా కష్టాలనుంచి గట్టెక్కించాలని ప్రేక్షక దేవుళ్లను కోరుకుంటున్నానంటూ అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది షకీలా. దయచేసి సినిమా చూడండి అని వేడుకుంటోంది. www.LadiesNotAllowed.Comలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా టిక్కెట్ రూ.50 మాత్రమే. ఇది అడల్ట్ కామెడీ ఫిల్మ్. లేడీస్ స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్. ఈ సినిమాను చూసి మమ్మల్ని దీవించండి.. ఇప్పటికి బతికిపోతాం. దేవుడి దయ, మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను అంటోంది. ఈ సినిమాను ఈ జులై 20న రాత్రి 8 గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!