HomeTelugu Trendingపేదలకు ఫుడ్‌ అందిస్తున్న షకీలా

పేదలకు ఫుడ్‌ అందిస్తున్న షకీలా

Actress shakeela distribute
సీనియర్ నటి షకీలా కరోనా కష్టకాలంలో బాధితులను అదుకోవడం కోసం ముందుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక… ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో, అలాంటి వారి ఆకలి తీర్చడానికి ఆమె ముందుకు వచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె పేద ప్రజల కోసం ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మనకున్న రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, రెండో చేతిని పేదలకు సాయం చేయడం కోసం వాడాలని కోరారు. మరోవైపు, షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. షకీలా నిర్వహిస్తున్న కుక్ విత్ క్లౌన్ షో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉంది. ఈ షోకు లక్షల్లో వీక్షకులు స్పందిస్తుంటారు. అయితే ఇప్పుడు సామాజిక సేవలో పాల్గొన్న షకీలను వారు మరింత ప్రోత్సహిస్తున్నారు. మీరు చేయండి.. మీతో మేమున్నాం అంటూ రీ పోస్ట్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu