HomeTelugu Trendingబాలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన 'అర్జున్‌ రెడ్డి' హీరోయిన్‌

బాలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన ‘అర్జున్‌ రెడ్డి’ హీరోయిన్‌

14 2
టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘అర్జున్‌ రెడ్డి’తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ‘షాలినీ పాండే’ బంపర్‌ ఆఫర్‌ కొట్టారు. ఆమె హీరోయిన్‌ గా తన తొలి బాలీవుడ్‌ సినిమాకు సంతకం చేశారు. స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జయేష్ భాయ్ జోర్దార్’. ఇటీవల ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను తీసుకున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘హిందీ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది ఓ మంచి అవకాశంగా భావిస్తున్నా.

ఈ విషయంలో కృతజ్ఞురాలిని. మా తరంలో సూపర్‌స్టార్‌ అయిన రణ్‌వీర్‌తో వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. ఆయనకు జోడీగా నటించబోతుండటం థ్రిల్లింగ్‌గా ఉంది. దీని వల్ల నాలో మరింత స్ఫూర్తి నిండింది. ఇంకా ఉత్తమ నటిగా మారేందుకు సాధన చేస్తాను’ అని చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత షాలినీ పాండే ‘మహానటి’, ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’, ‘118’, ‘గొరిల్లా’, ‘100% కాదల్‌’ తదితర సినిమాల్లో మెరిశారు. ప్రస్తుతం ఆమె ‘నిశ్శబ్దం’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాలోనూ కనిపించనున్నారు.

14a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!