శర్వా పక్కా ప్లానింగ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రన్ రాజా రన్  సినిమాతో కమర్షియల్ హీరోగా తన టాలెంట్ నిరూపించుకొని ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో తన మార్కెట్ స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు అదే రూట్ లో పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఇదే నేపధ్యంలో దిల్ రాజు బ్యానర్ లో ‘శతమానం భవతి’ సినిమాలో నటిస్తున్నాడు.
 
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో 24 సినిమాలుపూర్తి చేసుకున్న శర్వా తన 25వ  సినిమాగా మరో బడా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్నిర్మించే సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు. ఈ చిత్రంతో పాటు మరో పెద్ద  బ్యానర్ యు.వి.క్రియేషన్స్ తోను సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇలా వరుసగా పెద్ద నిర్మాతల సినిమాల్లో నటిస్తే అటు తన కెరీర్ కు,  ఇటు పబ్లిసిటీకు ఉపయోగపడుతుందనేది ఈ హీరో ప్లాన్. మొత్తానికి తన ఆలోచనలతో స్టార్ హీరోగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు.