HomeTelugu Trendingశర్వా 'శ్రీకారం' ఫస్ట్‌లుక్‌

శర్వా ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్‌

6 23
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్‌ 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్‌.బి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది. పోస్టర్‌ను షేర్‌ చేసిన చిత్రబృందం..’ఇతను మన కేశవుల కొడుకు.. పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’ అని పేర్కొంది. ఈ ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu