HomeTelugu Trendingఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: శివానీ రాజశేఖర్‌

ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: శివానీ రాజశేఖర్‌

Shivani rajshekar intervie
‘‘స్టార్‌ కిడ్స్‌కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు. అయితే కొత్తవారిలానే నేను, చెల్లి (శివాత్మిక) అవకాశాల కోసం ఆడిషన్స్‌ ఇచ్చాం. నా మూడేళ్ల యాక్టింగ్‌ కెరీర్‌లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. నేర్చుకోవడానికి అవధుల్లేవు’అని శివానీ రాజశేఖర్‌ అన్నారు. తేజా సజ్జా, శివానీ జంటగా మల్లిక్‌ రామ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శివాని మాట్లాడుతూ.. ‘‘హిందీ సినిమా ‘2 స్టేట్స్‌’ రీమేక్‌తో తెలుగులో నా ఎంట్రీ ఉండాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో నా తొలి సినిమా విష్ణువిశాల్‌తో ఓకే అయ్యింది. ఆ సినిమా కూడా వాయిదా పడింది. 2020 జనవరిలోనే ‘అద్భుతం’ షూటింగ్‌ పూర్తయింది. కోవిడ్‌ వల్ల విడుదల వాయిదా పడింది. ఓ దశలో నేను చేసిన సినిమాలు ఎందుకు రిలీజ్‌ కావడం లేదనే డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌ను ఫీలయ్యాను. అప్పుడు నాన్న(రాజశేఖర్‌), అమ్మ(జీవిత) సపోర్ట్‌ ఇచ్చారు. ఇటీవల మా తాత వరద రాజన్‌గారు చనిపోయారు. నా చెల్లి మూవీస్‌ చూసిన ఆయన నావి చూడలేదని బాధగా ఉంది. నేను చేసిన ‘డబ్ల్యూ.. డబ్ల్యూ..డబ్ల్యూ’(తెలుగు), ఉదయనిధి స్టాలిన్, హిప్‌ హాప్‌ తమిళతో(తమిళం) చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి’’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!