మాజీ మిస్ ఇండియాకు చేదు అనుభవం..! ఎక్కడ?


మాజీ మిస్ ఇండియా, “గూఢచారి” హీరోయిన్, తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. 2013లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, మిస్ ఎర్త్‌గా కూడా పోటీల్లో నిలిచిన ఈ సుందరి, ఓ సినిమా షూటింగ్ కోసం బురఖా వేసుకోవడం ఆమెకు అవమానం జరగడానికి కారణమైందట. బుర్ఖా వేసుకున్న తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ తెలుగమ్మాయి. గూఢచారి సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకున్న శోభిత ధూళిపాళ ప్రస్తుతం ‘ది బాడీ’ అనే తెలుగు/హిందీ మూవీతో పాటు ‘మేడ్ ఇన్ హెవెన్'(హిందీ), ‘బార్డ్ ఆఫ్ బ్లడ్'(హిందీ) చిత్రాల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శోభితా.. ఓ సినిమాలో ముస్లిం యువతిగా నటిస్తోంది. ఇందులో భాగంగా బురఖా వేసుకుని, ముస్లిం అమ్మాయిలా తయారై హోటెల్‌కి వెళ్లింది. బురఖాలో ఉండడం వల్ల హోటల్ రిసెప్షనిస్ట్ తనను గుర్తించలేదట.. తన రూమ్ తాళం ఇచ్చేందుకు వెనుకాడడమే కాకుండా అనుమానంతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తనతో అనుచితంగా ప్రవర్తించాడట. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో ప్రస్తావించింది శోభితా. నా బ్యాగ్, దుస్తులు దుమ్ముపట్టి ఉన్నాయి. బురఖాలో నేను ముస్లింలా కనిపించడం వల్లే అతడు అలా ప్రవర్తించాడు. ఆ సంఘటనతో వెంటనే పక్కకు వెళ్లాను. చాలా బాధేసింది అంటూ తన అనుభవాన్ని శోభిత పంచుకున్నారు. కొన్ని క్షణాలు అలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నా. ఏది ఏమైనా ఇలాంటి ప్రవర్తన చాలా తప్పు.. అని శోభిత వ్యాఖ్యానించారు.

CLICK HERE!! For the aha Latest Updates