
Biggest Telugu Disasters in 2024:
2024 తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించింది. కొన్ని హిట్ చిత్రాలు సందడి చేస్తే, కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన డిజాస్టర్లపై ఓ లుక్ వెయ్యండి.
Saindhav:
వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. సాంక్రాంతి సెలవుల్లో విడుదలైనా, ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. యాక్షన్ మోడ్‌లో వెంకటేష్ స్టెప్ తీసుకోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది.
Eagle:
రవితేజ కష్టాల్లో ఉన్న సమయంలో ఈగల్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యింది. ప్రధానంగా యూరప్‌లో చిత్రీకరణతో ఈ చిత్రం మంచి విజయం సాధించాలని భావించారు. కానీ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం అందించిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Operation Valentine:
వరుణ్ తేజ్ నటించిన పాన్-ఇండియన్ ఫిల్మ్ అయిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకుల నుంచి అస్సలు స్పందన పొందలేదు. ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
Manamey:
శర్వానంద్ స్టైలిష్ లుక్‌లో కనిపించిన చిత్రం మనమే. కానీ సీన్స్ బోరింగ్‌గా మారడంతో, లండన్ అందాలను చూపించడంలోనే సినిమా పరిమితమైపోయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రొడ్యూసర్‌కు పెద్ద నష్టాన్ని కలిగించింది.
Double iSmart:
రామ్, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన డబుల్ ఐస్మార్ట్ మీద పెద్ద అంచనాలు ఉన్నపటికీ, బలహీన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పూరి జగన్నాథ్‌కు ఇది ఆఖరి అవకాశం అనే విమర్శలు కూడా వినిపించాయి.
Mr Bachchan:
రవితేజ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చిత్రంగా వచ్చిన మిస్టర్ బచ్చన్ విఫలమైంది. ప్రమోషన్లలో హరీశ్ శంకర్ అత్యుత్సాహం చూపించడం సినిమా రిజల్ట్‌పై కూడా ప్రభావం చూపింది.
Matka:
వరుణ్ తేజ్ మాట్కా తో మరోసారి భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం కథ, లుక్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ALSO READ: Leela Vinodham: కొత్త ఓటిటి సినిమాతో Shanmukh Jaswanth మెప్పించాడా?