హీరోగా మారబోతున్న ప్రముఖ దర్శకుడు..!

టాలీవుడ్‌లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఇటీవలే తన రెండవ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో ప్రేక్షకుల్ని పలకరించారు. దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న ఈ ఆయన త్వరలోనే హీరోగా మారబోతున్నాడు.

యువ సంచలనం విజయ్ దేవరకొండ స్థాపించిన నిర్మాణ సంస్థలో రూపొందబోయే మొదటి సినిమాతో తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా మారనున్నాడు. ఈ సినిమాని ఓ తమిళ దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు అని సమాచారం. ఈ ప్రొజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.