HomeTelugu TrendingUpcoming Pan India South Films of 2024: నార్త్‌లో.. భారీ థియేట్రికల్ రైట్స్‌తో పాన్‌ ఇండియా సినిమాల రికార్డులు

Upcoming Pan India South Films of 2024: నార్త్‌లో.. భారీ థియేట్రికల్ రైట్స్‌తో పాన్‌ ఇండియా సినిమాల రికార్డులు

Upcoming Pan India South Films of 2024

Upcoming Pan India South Films of 2024: ప్రస్తుతం నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమాలు.. హిందీలో డబ్బింగ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వాటిని చూసేవారు బాలీవుడ్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారిపోయాయి.

స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో.. తెలుగు చిత్రాలను థియేటర్లలో చూడడానికి కూడా అదే విధంగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ నుండి లైన్‌లో ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల అన్నింటికి నార్త్ ఇండియాలో థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.

తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. థియేట్రికల్ రైట్స్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వినిపిస్తుండగా.. మిగతా సినిమాల థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపుగా ఇదే రేంజ్‌లో అమ్ముడుపోయాయి.

మిగిలిన సినిమాలతో పోలిస్తే.. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘పుష్ప 2’నే రికార్డ్‌ ని క్రియేట్‌ చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ కింద రూ.200 కోట్లను అందుకున్నారు ఈమూవీ మేకర్స్. దీన్ని బట్టి చూస్తుంటే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలకు ఉన్న ఫాలోయింగ్‌.. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ కూడా ఉంది.

‘పుష్ప 2’ తర్వాత రికార్డ్ స్థాయి అడ్వాన్స్ దక్కించుకున్న మూవీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘కల్కి’కి రెండో స్థానం దక్కింది.

ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా మేకర్స్‌కు రూ.100 కోట్ల అడ్వాన్స్ దక్కినట్టు సమాచారం. పుష్ప 2, కల్కి తర్వాత టాప్ 3 స్థానాన్ని ‘గేమ్ ఛేంజర్’ దక్కించుకుంది. ఇప్పటికీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. అప్పుడే నార్త్ ఇండియాలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ ప్రారంభమైంది.

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ కు ఇప్పటికే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా రూ.75 కోట్లు అడ్వాన్స్‌గా అందినట్టు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత స్థానంలో ఎన్‌టీఆర్ ‘దేవర’కు ఉంది. వరుసగా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవుతూ ఉండడం దేవర కు నష్టాన్ని కలిగిస్తోంది. అందుకే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ లిస్ట్‌లోని తెలుగు సినిమాల్లో దేవరకే చివరి స్థానం దక్కింది.

ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా.. మేకర్స్ రూ.45 కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. ఇక నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు ఉన్నంత డిమాండ్ తమిళ చిత్రాలకు లేదని అనిపిస్తోంది. దీనికి ఇండియన్ 2 కేవలం రూ.30 కోట్లే థియేట్రికల్ రైట్స్ అడ్వాన్స్ అందుకోవడమే ఉదాహరణ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu