శృతి స్టేట్మెంట్ ఇచ్చింది!

కమల్ హాసన్, గౌతమిల బ్రేకప వ్యవహారం ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్ గా మారింది. ఈ 
విషయాన్ని స్వయంగా గౌతమి ఓ ప్రకటన ద్వారా విడుదల చేయడం.. అందులో ఆమె పేర్కొన్న 
విషయాలు ఆమెపై సానుభూతి పెరిగేలా చేశాయి. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోవడానికి కారణం
శృతిహాసన్ అనే మాటలు వినిపిస్తున్నాయి. శభాష్ నాయుడు సినిమా చిత్రీకరణ సమయంలో కూడా
గౌతమికి, శ్రుతికి ఒకరంటే ఒకరికి పడలేదని ఇప్పుడు గౌతమి, కమల్ తో విడిపోయే విషయంలో
మెయిన్ విలన్ శృతి అని ఆమెను వేలెత్తి చూపడం మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా ఈ
విషయంపై ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయకపోవడం విశేషం. కానీ శృతిహాసన్ మాత్రం
తనదైన రీతిలో స్పందించింది. ”నేను వేరొకరి వ్యక్తిగత విషయాల్లో, వారు తీసుకునే నిర్ణయాల్లో
జోక్యం చేసుకోను. నా పేరెంట్స్, నా చెల్లెలు అంటే నాకు గౌరవం, ప్రేమ. వాళ్ళు తప్ప మరొక
విషయం నాకు అనవసరం” అంటూ క్లియర్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో 13 ఏళ్ళగా తన
తండ్రితో కలిసున్న గౌతమి పరాయి వ్యక్తి ఎలా అవుతుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.