ధోని ఎవరు..?: లక్ష్మిరాయ్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ధోనీ మాజీ ప్రేయసి రాయ్ లక్ష్మి మాత్రం ‘ధోని ఎవరు..?’ అని ప్రశ్నించి ఊహించని షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో ప్రస్తుతం రాయ్ లక్ష్మి నటించిన ‘జూలీ2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాయ్ లక్ష్మికి ధోనికు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సంధర్భంగా స్పందించిన ఆమె ముందుగా ‘ధోని ఎవరు..? అని ఎదురు ప్రశ్నించింది.
ధోని గురించి తనను, తన గురించి ధోనిని ప్రశ్నించడానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. తమ మధ్య చోటు చేసుకున్న సంఘటన చాలా కాలం కిందటిదని కొన్ని విషయాలు వర్కవుట్ కావని పేర్కొంది. వాటిని వదిలేసి ముందుకు సాగాలని హితవు పలికింది. ఇప్పుడు అతడు వివాహం చేసుకొని సంతోషంగా ఉన్నాడని, పిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేసింది. తనకు, ధోని మధ్య ఉన్న అనుబంధంపై మీడియా ఎక్కువ ఫోకస్ చేసిందని దీంతో మీడియాలో తమ గురించి రకరకాల కథనాలు వచ్చాయని అన్నారు. వాటి వల్ల ఇద్దరు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆయనపై గౌరవం ఉందని, అందుకే దీని గురించి పెద్దగా మాట్లాడడం లేదని స్పష్టం చేసింది.