మెగాస్టార్‌తో శృతిహాసన్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా’. ఈ మూవీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ సొంతబ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె, మెగాస్టార్ సైరా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శృతిహాసన్ ను తీసుకుంటున్నారని సమాచారం. చాలా కాలంగా శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. మెగాస్టార్ తో సినిమా అంటే ఒప్పుకుంటుందా లేదా చూడాలి. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమా చేసింది. కొరటాల శ్రీమంతుడు సినిమాలో కూడా చేసింది. రామ్ చరణ్ కు శృతి మంచి స్నేహితులు కావడంతో.. సినిమా చేసేందుకు ఒప్పుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.