HomeTelugu Big Stories'కల్కి 2898AD' రిలీజ్ డేట్ ఫిక్స్

‘కల్కి 2898AD’ రిలీజ్ డేట్ ఫిక్స్

kalki 2898 ad release date

గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ చిత్రం ‘ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD’. తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ అప్‌డేట్‌ అందించారు. ఈ చిత్రాన్ని 2024 మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే తేదీన విడుదల కావడం విశేషం. మరి ఈ సెంటిమెంట్‌ కల్కి 2898 ఏడీ చిత్రానికి ఎలా కలిసొస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయవాడలోని ఓ మల్టీప్లెక్స్‌లో రైడర్స్‌ గెటప్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటీనటులు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ సుమారు 600 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు నాగ్‌ అశ్విన్‌. కల్కి 2898 ఏడీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu