HomeTelugu Newsబిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ హేమచంద్ర

బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ హేమచంద్ర

bigg boss5 hema chandra

దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా బాగా పాపులరైన రియాల్టీ షో బిగ్‌బాస్. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో బిగ్‌బాగ్ వరుస సీజన్లు ప్రసారమవుతున్నాయి. అన్నిచోట్లా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంటోంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో నాలుగు సీజన్‌లు పూర్తిచేసుకుంది. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్‌తో మొదలు పెట్టారు. రెండో సీజన్‌లో నేచురల్ స్టార్ నాని చేశారు. మూడు, నాలుగు సీజన్లకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐదో సీజన్‌కు రెడీ అవుతోంది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ సీజన్‌లో నాగార్జున కనిపించరని వార్తలు వచ్చాయి.

బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వారు ఆ తర్వాత పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్‌సిరీస్ అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులో ప్రతి సీజన్ జూన్‌లో ప్రారంభమవుతున్నా బిగ్‌బాస్ గతేడాది కరోనా కారణంగా డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇక తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో ఎవరెవరిని తీసుకుంటున్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ సింగర్ హేమచంద్ర వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వెబ్‌ సిరీస్‌తో పాపులరైన షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu