బాలయ్య సినిమాలో బాలీవుడ్‌ విలన్‌..


టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ బోయపాటి తో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం శ్రీకాంత్ ను తీసుకున్నారు.

దాంతో ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా అనుకున్నారు. కానీ శ్రీకాంత్ కాకుండా మరో విలన్ కూడా ఉంటాడట. ఆ విలన్ ను బాలీవుడ్ నుంచి రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న బాలీవుడ్ ఆర్టిస్టును తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణకి .. బాలీవుడ్ విలన్ కి మధ్య భారీ యాక్షన్ సీన్స్ .. చేజింగ్స్ వుంటాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ‘సింహా’ .. ‘లెజెండ్’ వంటి భారీ విజయాల తరువాత బోయపాటి.. బాలయ్యల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.