HomeTelugu Trendingఅన్నీ కోల్పోయి ఆఖరికి చనిపోవాలనుకున్నా: కల్పన

అన్నీ కోల్పోయి ఆఖరికి చనిపోవాలనుకున్నా: కల్పన

Singer Kalpana latest Inter
సింగర్‌ కల్పన.. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడింది. ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించిన కల్పన శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్‌లోనైనా అవలీలగా ఆలపిస్తుంది. ‘మనోహరం’ సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్‌తో ఫుల్‌ టైమ్‌ ప్లేబ్యాక్ సింగర్‌గా మారింది. ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కెవి, మహదేవన్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో కలిసి ఆమె పనిచేశారు. వరల్డ్‌వైడ్‌గా 3 వేల స్టేజ్‌ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్‌ చేసిన కల్పన బిగ్‌బాస్‌లో కూడా అలరించింది.

అయితే ఎంతో సక్సెస్‌ సాధించిన కల్పన జీవితంలో కూడా ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ”25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. అనేక వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. ఒక పాప ఉంది. ఉద్యోగం లేదు. అన్నీ కోల్పోయిన నేను ఆఖరికి చనిపోవాలనుకున్నా. కానీ సింగర్‌ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పాల్గనమని ఎంకరేజ్‌ చేశారు.

సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటికి నాకు మలయాళం అస్సలు తెలియదు. కసితో వెళ్లాను. నా కుమార్తె కోసం విల్లా గెలవాలనుకున్నాను. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో కష్టపడి ఆ పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ గెలుపు తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది” అని సింగర్ కల్పన తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!