HomeTelugu Big Storiesరెహమాన్‌ నిర్మాతగా.. పి సుశీలా బయోపిక్‌!

రెహమాన్‌ నిర్మాతగా.. పి సుశీలా బయోపిక్‌!

Singer P Susheela biopic AR

ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ’99 సాంగ్స్’. సంగీతం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. 99 సాంగ్స్ చిత్రంతో ఏ.ఆర్.రెహమాన్ స్క్రీన్ రైటర్ గా మారారు. “99 సాంగ్స్”లో కొత్త హీరో, హీరోయిన్‌లు ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాని లెజెండరీ సింగర్ సుశీలా ఇటీవల చూశారు. అనంతరం ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. తన బయోపిక్ చేయాలని లెజెండరీ గాయని రెహమాన్ ను ప్రేమపూర్వకంగా అభ్యర్థించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. ఇటీవల నేను సుశీలమ్మతో ఫోన్ కాల్ లో మాట్లాడినప్పుడు నా 99 సాంగ్స్‌ సినిమా చూశారా? అని అడిగాను. నెట్ ఫ్లిక్స్ లో చూడమని చెప్పాను. అందుకు సుశీలమ్మ సోదరుడు సాయపడ్డారు. సినిమా చూసిన తరువాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్ ను 99 సాంగ్స్ మాదిరిగా మంచిగా చేయమని కూడా ఆమె నన్ను కోరారు.. అని రెహమాన్ తెలిపారు. తన బయోపిక్ తీయమని లెజెండరీ సుశీలమ్మ కోరగానే ఉద్వేగానికి లోనయ్యానని ఆనందం కలిగిందని రెహమాన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుశీల బయోపిక్ తెరకెక్కిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!