బాలీవుడ్ లో దేవకట్టా సినిమా!

ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, డైనమైట్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు దేవకట్టా త్వరలోనే బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అతని కెరీర్ లో ‘ప్రస్థానం’ సినిమా ఓ మైలు రాయిగా నిలిచింది. అప్పట్లోనే ఈ సినిమాను తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో రీమేక్
చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఏది పట్టాలెక్కలేదు.

ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు దర్శకుడు దేవకట్టా. బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్రనిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్ర కోసం బాలీవుడ్ లో నానాపటేకర్ ను ఎన్నుకున్నారు. శర్వానంద్, సందీప్ కిషన్ ల పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సివుంది.

బాలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని దేవకట్టా డైరెక్ట్ చేయనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా.. కథలో కొత్తదనం ఉండడం వలన హిందీలో చేయడానికి ధైర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.