HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్‌ సునీత కుమారుడు!

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్‌ సునీత కుమారుడు!

sunitha

సింగర్‌ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఏడాది క్రితం రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్‌ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్‌ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఓ ఆసక్తికరవార్త బయటకు వచ్చింది.

sunitha 1

సునీత తనయుడు ఆకాశ్‌ త్వరలో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు.

వివాదంపై సునీత భర్త స్పందన

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!