
Salman Khan Car Collection:
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ లైఫ్‌స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖరీదైన గడియారాలు, స్టైలిష్ డ్రెస్సులు, లగ్జరీ కార్లు… ఇవన్నీ ఆయన స్టేటస్ సింబల్స్. ఇప్పుడు ఆయన తన గ్యారేజ్‌లో మరో కొత్త బీస్ట్‌ను జోడించారు. అదే మెర్సిడెస్ మేబాచ్ GLS 600 SUV.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో సల్మాన్ ఖాన్ ఈ లగ్జరీ SUVలో ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో కూర్చుని కనిపించారు. కార్ క్రేజీ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. విండ్షీల్డ్‌పై 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్ ఉండటంతో ఇది తాజాగా కొన్న కారు అని స్పష్టమవుతోంది.
ఈ కార్ బేసిక్ వెర్షన్ ధరే రూ.3.39 కోట్లు. కానీ ఇది బుల్లెట్‌ప్రూఫ్ అయితే ఖర్చు రూ.5 కోట్లకు పైగా కూడా వెళ్లవచ్చు. గతంలో సల్మాన్‌కు బెదిరింపులు రావడంతో ఆయన సెక్యూరిటీ కఠినంగా ఉండటం తెలిసిందే. Thick Glass ఎడ్జెస్‌ను బట్టి ఇది బుల్లెట్‌ప్రూఫ్ కావచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కార్ కలెక్షన్ 2025:
రేంజ్ రోవర్ SC LWB 3.0
టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200
మెర్సిడెస్ బెంజ్ GL
ఆడి RS7
బుల్లెట్‌ప్రూఫ్ నిస్సాన్ పాట్రోల్
ఆడి A8L
ల్యాండ్ రోవర్ వోగ్
AMG GLE కూపే
ప్రొఫెషనల్‌గా, సల్మాన్ తదుపరి సినిమా ఇండియా’స్ మోస్ట్ ఫియర్‌లెస్ 3 పుస్తకంలోని గాల్వాన్ అధ్యాయంపై ఆధారపడినట్లు వార్తలు. ఇందులో ఆయన 2020 గాల్వాన్ ఘర్షణలో పోరాడిన కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నారు.













