HomeTelugu Big StoriesSirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు.. శిరీష్ భరద్వాజ్ మృతి

Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు.. శిరీష్ భరద్వాజ్ మృతి

Sirish Bhardwaj 2 Sirish Bharadwaj

Sirish Bharadwaj death:- చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు మృతి చెందారు. శిరీష్ భరద్వాజ్ అనారోగ్యం తో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శిరీష్ భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ తో  హాస్పిటల్ లో మృతి చెందారు.గతంలో చిరంజీవి కూతురు శ్రీజ ను వివాహం చేసుకున్నారు శిరీష్ భరద్వాజ్

చిరంజీవి చిన్న కూతురు.. శ్రీజ కొణిదెల గతంలో.. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని .. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియాలో అప్పట్లో ఈ వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. శిరీష్ ని పెళ్లి చేసుకోడానికి శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. పెద్ద వివాదమే అయింది. శిరీష్ భరద్వాజ్ – శ్రీజలకి నివ్రతి అనే కూతురు కూడా ఉంది. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడం వల్ల విడిపోయారు. ఆ తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్.. అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం శ్రీజ తన పిల్లలతో కలిసి చిరంజీవి దగ్గరే ఉంటుంది.

అయితే ఈరోజు ఉదయం శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ భరద్వాజ్. నేడు ఉదయం చికిత్స తీసుకుంటూనే.. హాస్పిటల్ లో శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu