పవన్ కోసం యంగ్ డైరెక్టర్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, దాని తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే పవన్ తో సినిమా చేయడానికి మరో
యంగ్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు.

అజిత్ కు వరుస హిట్స్ ఇస్తోన్న దర్శకుడు శివ, పవన్ తో సినిమా చేయాలని తపన పడుతున్నాడు. వీరం, వేదాళం వంటి సినిమాలతో అజిత్ కెరీర్ లోమంచి హిట్స్ గా నిలిచిపోయే సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయనతో సినిమా చేసే పనిలోనే ఉన్నాడు. అయితే పవన్ కోసం కూడా ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట. వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న పవన్, శివ చెప్పే కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో.. లేదో.. చూడాలి!