స్కిన్ షోకు సెట్ కానంటోంది!

‘నేను శైలజ’ చిత్రంతో యూత్ లో క్రేజ్ ను సంపాదించుకొని తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా
మారిపోయింది కీర్తి సురేష్. ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. అలానే
తెలుగులో నాని సరసన ‘నేను లోకల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు కీర్తి చాలా
ట్రడిషనల్ గా ఉండే పాత్రల్లోనే కనిపించింది. ఈ నేపధ్యంలో ఇతర హీరోయిన్స్ ల మీరు స్కిన్
షో చేస్తారా..? ఆమెను ప్రశ్నించగా.. ‘అబ్బే.. మనకు అలాంటివి సెట్ కావండీ’ అని సమాధానమిచ్చింది.
అయినా స్కిన్ షో చేయడానికి నా శరీరం సూట్ కాదు. అలాంటి పాత్రల్లో నటించడానికి
నాకు ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందుకే అలాంటి సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు.
అయినా ప్రేక్షకులు స్కిన్ షో కంటే ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారనే చూస్తున్నారు. సో..
నేను ఇక మీదట కూడా స్కిన్ షో చేయాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చారు.

CLICK HERE!! For the aha Latest Updates