
Upcoming Telugu Sequels:
చిన్న సినిమాలు నుంచి స్టార్ హీరో సినిమాల దాకా బ్లాక్ బస్టర్ అయిన చాలా సినిమాలకి సీక్వెల్స్ వస్తున్నాయి. కొన్ని సినిమాలు రెండవ భాగాలుగా విడుదల అవుతూ ఉండగా, మరి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. ఇలా చాలానే సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం.
పుష్ప ది రూల్:
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటన తో బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కాబోతోంది.
సలార్ పార్ట్ 2:
వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న సమయంలో ప్రభాస్ కి మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా సలార్. అద్భుతమైన క్లైమాక్స్ ట్విస్ట్ తో ఎండ్ అయిన ఈ సినిమాకి రెండవ భాగం సలార్ 2 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
కల్కి 2898AD పార్ట్ 2:
సైన్స్ ఫిక్షన్ సినిమాగా మైథాలజీని, ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ని నాగ్ అశ్విన్ మిక్స్ చేసిన విధానం అద్భుతం అని చెప్పచ్చు. తొలి భాగంతో 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం సీక్వెల్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది అని ఫ్యాన్స్ అంచనా.
డబుల్ ఇస్మార్ట్:
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబో లో వచ్చిన హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
హిట్ కేస్ 3:
హిట్ సిరీస్ లో విశ్వక్ సేన్ మొదటి భాగంలో, అడివి శేష్ రెండవ భాగంలో నటించి హిట్ అందుకున్నారు. హిట్ సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడవ భాగం హిట్ 3 లో నాని హీరోగా నటిస్తున్నారు.
జై హనుమాన్:
చిన్న సినిమాగా వచ్చినా కూడా హను మ్యాన్ బీభత్సమైన హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ కూడా ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కార్తికేయ పార్ట్ 3:
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ సిరీస్ లో మూడవ భాగం ఇది. ఈసారి మరింత మిస్టరీ, సస్పెన్స్ తో నిండి ఉంటుంది అని రాబోతోంది.
గూఢాచారి పార్ట్ 2:
అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా గూఢాచారికి సీక్వెల్ ఇది. సీక్రెట్ ఏజెంట్ కథగా ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సీక్వెల్ పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
బింబిసార పార్ట్ 2:
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియడ్ ఫాంటసీ సినిమా బింబిసార కి రెండవ భాగం కూడా మొదలు అయ్యింది. అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
టిల్లు క్యూబ్:
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.
పొలిమేర పార్ట్ 3:
సత్యం రాజేష్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ పొలిమేర సిరీస్ లో రెండు సినిమాలు మంచి ట్విస్టులతో ప్రేక్షకులను అలరించాయి. అందులో మూడవ భాగంగా పొలిమేర పార్ట్ 3 షూటింగ్ ఈ మధ్యన మొదలైంది.
మ్యాడ్ మ్యాక్స్:
సంగీత్ శోభన్ హీరోగా నటించిన మ్యాడ్ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో నటించిన నటీనటులతోనే ఇప్పుడు సినిమాకి సీక్వెల్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.













