సోనాక్షి యాక్షన్ సీన్స్ ఆదిరాయి!

సోనాక్షి యాక్షన్ సీన్స్ ఆదిరాయి!
ఏ.ఆర్.మురుగదాస్ బాలీవుడ్ లో ‘అకీరా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 2011లో తమిళంలో 
వచ్చిన ‘మౌనగురు’ అనే చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో ఈ చిత్రం ఓ రేంజ్ లో వసూళ్ళ వర్షం 
కురిపించింది. ఇప్పుడు ఆ కథలో కొన్ని మార్పులు చేసి సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్ గా తీసుకొని 
మురుగదాస్ రూపొందిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు ముద్దుగా, బొద్దుగా 
కనిపించిన సోనాక్షి ఈ సినిమాలో మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో కనిపించబోతోంది. 
ఇటీవలే ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సోనాక్షి తన శత్రువులను 
కొట్టే యాక్షన్ సీన్స్ అదిరాయనే చెప్పాలి. ఈ మేకింగ్ వీడియో సినిమాపై హైప్ మరింత పెంచేసింది. 
సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
CLICK HERE!! For the aha Latest Updates