
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఈ లోపే ఈ సాంగ్ ఆన్‌లైన్‌లో లీకైంది.
లీక్స్ జరుగకుండా మేకర్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సాంగ్ లీక్‌పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీక్‌పై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్స్ డివిజన్ ఏసీపీ చంద్రభాషా, ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐ ప్రసేన్ రెడ్డి, ఎస్‌ఐ సాయితేజ శ్రీ బృందం భవిష్యత్తులో పైరసీ ఘటనలు జరగకుండా హెచ్చరికలు జారీ చేశారు.
గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న సినిమాలో తెలుగు హీరోయిన్ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.













