
Game Changer Movie:
రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు. “సినిమా ఫలితం పక్కనపెడితే, దీన్ని ఎలా తీశారు? ఎలా ప్రమోట్ చేశారు?” అని ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తున్నారు.
ఈ సినిమా ఇండియన్ 2 తో పాటు డైరెక్టర్ శంకర్ తీసారు. రెండు సినిమాలు ఒకేసారి హ్యాండిల్ చేయడం వల్ల రెండు ప్రాజెక్ట్స్ మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టలేకపోయారనేది ఆరోపణ. శంకర్ ఒక పాత ఇంటర్వ్యూలో “సినిమా మొత్తం ఐదు గంటల కంటే ఎక్కువగా వచ్చేసింది, నేను ఫైనల్ కట్ తో సంతృప్తిగా లేను” అన్నారు.
View this post on Instagram
ఇదే విషయం ఎడిటర్ షమీర్ మొహమ్మద్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అసలు మ్యాటర్ బయట పడింది. ఆయన మాటల్లోనే, “ఫుటేజ్ మొత్తం 7.5 గంటలు వచ్చిందట. నేను దాన్ని 3 గంటలకు తగ్గించాను. తర్వాత ఇంకో ఎడిటర్ మరింత కట్ చేశాడు. శంకర్ గారి వర్కింగ్ స్టైల్ నాకు నచ్చలేదు. ఎక్స్పీరియన్స్ చాలా హారిబుల్ గా ఫీలయ్యాను. అందుకే మధ్యలోనే బయటకి వచ్చేశాను.”
ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు డైరెక్టర్ శంకర్ మీద విరుచుకుపడుతున్నారు. “ఇవన్ని చూసిన తర్వాత తెలిసింది.. డబ్బు, టైం ఎంత వృథా అయ్యిందో!” అని కామెంట్స్ వస్తున్నాయి. ఒక నటుడికి శంకర్ సినిమా చేయడం ఓ కల. కానీ ఈ సినిమా ఆ కలను చేదుగా మార్చేసింది అనిపిస్తుంది.
ALSO READ: అదుర్స్ నటుడు Mukul Dev అకాల మరణం!