HomeTelugu Trendingహీరోయిన్‌ న్యూలుక్‌ వైరల్‌

హీరోయిన్‌ న్యూలుక్‌ వైరల్‌

Sonia agarwal new look vira
టాలీవుడ్‌లో 7/G బృందావన్ కాలనీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్‌. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి కనుమరుగైంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం ఆతర్వాత విడాకులు అంటూ వివాదాల్లో కొన్ని రోజులు మునిగిపోయింది. ఆ తర్వాత సినిమాలో ఆఫర్లు తగ్గడంతో.. అడపాదడపా కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌లతో మెరిసి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు దక్కించుకుంటోంది. కాగా ఈ భామ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో సోనియా అగర్వాల్ ఏమాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది. పూర్తిగా సన్నజాజిలా తయారైంది. ఇది చూసిన నెటిజన్స్.. సోనియాకు ఏమైంది అంటుంటే. కొందరు సోనియా ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా.. మొఖం గుర్తుపట్టలేకుండా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ తాజా ఫోటో సోనియా బాగుందని మరికొందరు అంటున్నారు. హీరోయిన్ అవకాశాలు లేవు.. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా.. ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. నాతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించింది.. సోనియా. అందులో భాగంగా సోనియా ఇంకా ఏమైనా హీరోయిన్ పాత్రలు ఆశిస్తోందా.. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో అని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!