ఎన్టీఆర్ కోసం ఆ హీరోయిన్‌ కోసం ప్రయత్నిస్తున్న రాజమౌళి!

బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రారంభించాడు. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. సెకండ్ షెడ్యూల్ మధ్యలో ఉండగా చరణ్ కు గాయం కావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. దీంతో పాటు ఎన్టీఆర్ కు హీరోయిన్ గా అనుకున్న హాలీవుడ్ నటి డైసీ సినిమా తప్పుకోవడంతో రాజమౌళి మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అయితే, ఎన్టీఆర్ కోసం నిత్యా మీనన్, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేస్తారని అనుకునేలోపే మరో హీరోయిన్ పేరు తెరమీదకు వచ్చింది. ఆమె సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకొని నటిస్తోంది. ప్రభాస్ తో సాహో తో పాటు బాలీవుడ్ లో చిచ్చోరే, స్ట్రీట్ డ్యాన్సర్ సినిమాలు లైన్లో ఉన్నాయి. కథ పరంగా శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం. మరి ఎవరి పేరును ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ప్రకటిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.