HomeTelugu Trendingశివశంకర్‌ మాస్టర్‌ కోసం ముందుకొచ్చిన సోనూసూద్‌

శివశంకర్‌ మాస్టర్‌ కోసం ముందుకొచ్చిన సోనూసూద్‌

sonusood about shiva shanka

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు సాయం చేసేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ముందుకు వచ్చారు. కరోనా కారణంగా శివశంకర్‌ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వైద్య చికిత్సకు డబ్బు సర్దుబాటు చేయడంలో శివశంకర్‌ కుటుంబసభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బుధవారం రాత్రి సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకొన్న సోనూసూద్‌.. వెంటనే స్పందించారు. శివశంకర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

శివశంకర్‌ మాస్టర్‌ గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu