అవన్నీ పుకార్లేనట!

రామ్‌ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఓ రోజు నేను షూటింగ్‌కు వెళ్లలేదు, అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాను. ప్రకాశ్‌రాజ్‌తో సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. దాన్ని ఆధారంగా తీసుకుని పుకార్లు సృష్టించారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పుకార్లను నమ్మొద్దని అన్నారు.

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా రూపొందిన హలో గురు ప్రేమకోసమే చిత్రం మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు త్రినాథరావు దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం అని, చిత్రం బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారని హీరోయిన్‌ అనుపమ అన్నారు. ఇకపై మంచి కథలను ఎంచుకోవడానికే ప్రాముఖ్యనిస్తానని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates