HomeTelugu News'ఆదిపురుష్': ప్రభాస్‌కు తమ్ముడిగా సౌత్‌ హీరో!

‘ఆదిపురుష్’: ప్రభాస్‌కు తమ్ముడిగా సౌత్‌ హీరో!

South star in prabhas Adipయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో.. సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా… దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన ఓ యంగ్‌ హీరో నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందా? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu