‘అరవింద సమేత’ ఆడియో విడుదల

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎస్‌. ఎస్‌. తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం నుండి ఆడియో సాంగ్స్‌ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమాలకు భిన్నంగా కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉండటం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఈ సినిమాలోని పాటలు.. సిట్యుయేషన్ కు అనుగుణంగా ఉన్నాయని పాటలను బట్టి తెలుస్తున్నది.

‘యాడ పోయినాడో’ పాట రాయలసీమకు వ్యక్తి అవసరం ఎలాంటిదో స్పష్టంగా తెలుపుతూ ఉన్నది. సిరివెన్నెల, పెంచల దాస్ లు రాసిన ఈ పాట శ్రోతలను యిట్టె ఆకట్టుకుంటుంది. రాయలసీమ గుండెల్లోని అర్థతను తెలియజేసే విధంగా ఉన్నది.

రెండో సాంగ్ ‘అనగనగా’ కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ గా వచ్చింది. మెలోడీ ప్రాధాన్యంగా వచ్చిన ఈ సాంగ్ ప్రేమికుల మధ్య వచ్చే సాంగ్ లా ఉన్నది. సిరివెన్నెల రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి పాడటం విశేషం.

మూడో సాంగ్ ‘పెనివిటి’ పాట ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంది. ప్రతి గుండెను ఈ పాట కదిలించివేసింది. సోషల్ మీడియాలో ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కాల భైరవ పాడారు.

నాలుగో పాటగా ‘రెడ్డి ఇక్కడ సూడు’.. ఫాస్ట్ బీట్ గా వచ్చింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు పాటను పాడిన థిల్లర్ మెహందీ, అంజనా సౌమ్య కలిసి పాడారు. ఈ సాంగ్ మాస్ అభిమానులకు ఆకట్టుకుంటుంది. నాలుగు పాటలు అద్భుతంగా ఉండటంతో.. సినిమాపై ఆసక్తి పెరిగింది.