HomeTelugu Trendingఎస్‌పీ బాలుకి అదుదైన గౌరవం.. వైరల్‌

ఎస్‌పీ బాలుకి అదుదైన గౌరవం.. వైరల్‌

SP Balasubramaniam Chocolat

గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ‍్మ​ణ్యంకి మరో అరుదైన గౌరవం దక్కింది. కోవిడ్-19 కారణంగా (సెప్టెంబర్ 25, 2020)న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున​ సంస్థ తాజాగా ఎస్‌పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్‌ రాజేంద్రన్ చెప్పారు. ఈ విగ్రహాం చేయడానికి 161 గంటలు పట్టిందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu