HomeTelugu Trendingసినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్న శ్రీలీల

సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్న శ్రీలీల

Sree Leela
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ తారగా వెలుగొందుతోంది శ్రీలీల. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన ఈ అందాల తార ప్రస్తుతం ఎంబీబీస్ చివరి సంవత్సరం చదువుతోంది. యువ హీరోలతో పాటు టాప్ స్టార్ల వరకూ ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి.

రామ్ పోతినేనితో నటించిన ‘స్కంద’ వైష్ణవ్ తేజ్‌తో నటించిన ఆది కేశవ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మహేశ్ బాబు, బాలకృష్ణ, నితిన్, విజయ్ దేవరకొండ, పవన్‌ కల్యాణ్ సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. ఆమె జోరుకు కొన్నాళ్లు బ్రేక్ పడనుంది.

ఆమె చదువుతున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు దగ్గరపడుతుండటంతో 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని శ్రీలీల అనుకుంటోంది. తన పరీక్షల విషయం దర్శక, నిర్మాతలకు చెప్పి నవంబర్ నుంచి జనవరి వరకు కొన్ని కీలక ప్రాజెక్ట్స్ నుంచి శ్రీలీల బ్రేక్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu