నవంబర్‌ 18న ప్రభాస్‌ ‘జాన్‌’ ప్రారంభం


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. సాహో చిత్రంతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన ప్రభాస్‌ ఆయన తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుకను గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించగా.. రెగ్యులర్‌ షూటింగ్‌ను 2018 డిసెంబర్‌ నుంచి ప్రారంభించాలని ప్లాన్‌ చేసుకుంది చిత్ర బృందం. కానీ ప్రభాస్‌ సాహో మూవీతో బీజీగా ఉండటంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ‘సాహో’ షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. విశ్రాంతి అనంతరం ‘జాన్‌’ షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నవంబర్‌ 18 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

కాగా బాహుబలి ప్రభాస్‌ ఈ సినిమా విషయాన్ని ప్రారంభంలోనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు రాధకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 1970 కాలంలో సాగే ఈ చిత్రం మంచి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని, కొన్ని కీలక సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నామని, రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ.. జాన్‌లో హీరోయిన్‌గా సైన్‌ చేసిన తర్వాత షూటింగ్‌కు ప్రారంభం కాకముందే ముంబైలో ప్రభాస్‌, తాను ఈ సినిమాలోని కీలక సన్నిలవేశాలను గురించి చర్చించామని. అలాగే సన్నివేశాలలో ప్రాథమికంగా నటించామని చెప్పారు. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ మ్యూజిక్‌ను అందించనున్నారు.