HomeTelugu Trendingఇక నుంచి నీకు 'సామ‌జ వ‌ర‌గ‌మ‌నే‌'

ఇక నుంచి నీకు ‘సామ‌జ వ‌ర‌గ‌మ‌నే‌’

Sree Vishnu Birthday Glimps

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ‌విష్ణు న‌టిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘సామ‌జ వ‌ర‌గ‌మ‌న‌’. ఈ రోజు శ్రీవిష్ణు 29వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.క‌ల‌ర్ ఫుల్ విజువ‌ల్స్ తో గ్లింప్స్‌ మొద‌లైంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామ‌నుకునే వాళ్ల‌కి క్యాస్ట్ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది లేక పోతే క్యాష్ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది.

ప్ర‌పంచంలో ఎవ‌డికీ రాని వింత ప్రాబ్ల‌మ్ నాకొచ్చిందేంట్రా… ల‌వ్ మ్యారేజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్ల‌మ్ ఒక‌టి వుంటుంద‌ని నువ్వు ల‌వ్ స్టోరీ చెప్పేదాకా మాకు తెలియ‌లేదురా.. ఇక నుంచి నీకు ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నే’ అంటూ సాగే డైలాగ్ లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి.

వరుస ఫ్లాప్‌లతో ఉన్న శ్రీవిష్ణు.. ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని చాలా రోజుల త‌రువాత త‌న‌కు అచ్చి వ‌చ్చిన కామెడీ జోన‌ర్ ని ఎంచుకుని ”సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న’ మూవీతో, యునిక్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. కీల‌క కామెడీ స్టార్లు న‌టిస్తున్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోంది.

ఈ మూవీని ఏకె ఎంట‌ర్ టైన్ మెంట్స్‌, హాస్య మూవీస్ బ్యాన‌ర్ ల‌పై రాజేష్ దండ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఏకె ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మోనికా జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu