
Sreeleela Upcoming Movies:
టాలీవుడ్‌లో శ్రీలీల ఇప్పుడు హాట్ ఫేవరేట్ హీరోయిన్. “పెళ్లి సందడి” తో ఎంట్రీ ఇచ్చిన ఆమె “ధమాకా” సినిమా తర్వాత సూపర్ ఫేమస్ అయింది. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తూ పెద్ద స్టార్స్‌తో ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఇప్పుడు అదే షెడ్యూల్ సమస్య గా మారింది.
కొన్ని సినిమాలు ప్లాప్ అయినా, శ్రీలీల పాపులారిటీ మాత్రం తగ్గలేదు. ఆమె ఆక్టింగ్, డాన్స్ స్కిల్స్ తో ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అందుకే “ఉస్తాద్ భగత్ సింగ్” (పవన్ కళ్యాణ్), “రాబిన్ హుడ్” (నితిన్), “మాస్ జాతర” (రవితేజ) లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
“పుష్ప 2: ది రూల్” లో స్పెషల్ డాన్స్ చేసిన శ్రీలీల మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కానీ ప్రస్తుతం ఎక్కువ సినిమాలు సైన్ చేయడం వల్ల డేట్స్ ఇష్యూస్ వస్తున్నాయి.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, శ్రీలీల ఇప్పటికే మాస్ జాతర సినిమాకు అడ్వాన్స్ తీసుకుని, డేట్స్ ఇవ్వడం ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ 20 రోజుల షూటింగ్ అవసరం అని చెబుతున్నారు. కానీ శ్రీలీల ఇప్పటికే ఒక తమిళ సినిమాకు డేట్స్ ఇచ్చేసింది. దీని వల్ల మాస్ జాతర టీమ్ ఆమెను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉంది.
శ్రీలీలను రీప్లేస్ చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ అయ్యాయి. కొత్త హీరోయిన్ తీసుకుంటే మళ్లీ అన్ని సీన్స్ రీ-షూట్ చేయాలి. ఇది నిర్మాతలకు భారీ ఖర్చు అవుతుంది. ఇదే సమస్య అఖిల్ అక్కినేని కొత్త సినిమాలో కూడా ఉందని టాక్.
శ్రీలీల టాలెంట్, హార్డ్ వర్క్ వల్ల ఈ స్థాయికి వచ్చింది. కానీ ఇప్పుడు షెడ్యూల్ సమస్యలు ఉంటే, చక్కటి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సినిమాలు ఎక్కువ సైన్ చేయడం కంటే, సరిగ్గా కంప్లీట్ చేయడం ముఖ్యం. లేదంటే ఫిల్మ్ మేకర్స్ ఆమెను నమ్మడం మానేస్తారు!
ALSO READ: Telangana Caste Census Results లో బయటకు వచ్చిన సంచలన నిజాలు!