డివోర్స్ ఇచ్చినా భర్తే ముఖ్యమంటోంది!

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖానా.. తన భర్త అర్భాజ్ ఖాన్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయినప్పటికీ తమ కుమారుడు కోసం అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకుంటున్నారు. ఇటీవల మలైకాను ఓ నెటిజన్ టార్గెట్ చేసి ఆమె డబ్బు కోసమే అర్భాజ్ కు విడాకులిచ్చిదంటూ దూషించాడు. దానికి తగ్గ సమాధానం కూడా మలికా ఇచ్చిందనుకోండి. అయితే భర్త విడిపోయిన తొలిసారి ఆమె మీడియాతో తన విడాకుల సంగతి ప్రస్తావించింది. 
‘అర్భాజ్ నా కుమారుడికి తండ్రి. నా కుటుంబంలో ఆయనొకరు. ఆయనతో విడిపోవడం నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్భాజ్ ను కలిస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడు. తన సంతోషమే నాకు ముఖ్యం. నాకు మాత్రమే అర్భాజ్ తో ఎలాంటి సంబంధం లేదు. మా ఇంట్లో వారితో తను స్నేహపూర్వకంగానే ఉంటాడు. మేమిద్దరం విడిపోయినప్పటికీ అర్భాజ్ నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఒకరి నుండి విడిపోవడం అంత సులువైన విషయం కాదు. ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తోంది. ప్రస్తుతానికి నేను ప్రతిదీ నా స్నేహితులతోనే షేర్ చేసుకుంటున్నాను. నా కొడుకుతో సంతోషంగా ఉన్నాను’ అని వెల్లడించారు.