మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సంచలన నటి

కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేసిన హంగామా అంతాఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్నిశ్రీ రెడ్డి బహిరంగంగా ప్రశ్నించింది. ఆ తరువాత చాలాకాలం పాటు శ్రీరెడ్డి సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు పొల్లాచ్చిలో సినీ రంగానికి చెందిన మహిళలను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఈ నటి చెన్నై వెళ్లి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. అంతకు ముందు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడాలని చూస్తే తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని శ్రీరెడ్డి పేర్కొంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది.