HomeTelugu Trendingశ్రీ సింహా కొత్త చిత్రం 'ఉస్తాద్'

శ్రీ సింహా కొత్త చిత్రం ‘ఉస్తాద్’

Sri simha koduri new film u
‘మత్తు వదలరా, తెల్లవారితే గురువారం’ చిత్రాల హీరో శ్రీ సింహా కోడూరి నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిన్న గురువారం ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్‌ కొట్టారు. ‘న్యూ ఏజ్‌ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘ఉస్తాద్‌’. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని మూవీయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పవన్‌ కుమార్‌ పప్పుల, సంగీతం: అకీవా. బి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!