పెళ్ళికి ముందు ప్రేమకథకు అవసరాల వాయిస్!

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “పెళ్ళికిముందు ప్రేమ కధ”.”రాజుగారి గది” ఫేమ్ చేతన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ చెప్పారు. నేటితరం యువత జీవితంలో చాలా కీలకమైన పెళ్లి అనే ఘట్టానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆ కారణంగా వారి జీవితాల్లో తలెత్తుతున్న సమస్యల నేపధ్యంలో విజ్ణానానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా డి.ఎస్ రావు మాట్లాడుతూ.. “నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేటితరానికి మంచి మెసేజ్ తోపాటు ఎంటర్ టైన్మెంట్ ను అందించే సినిమా “పెళ్ళికి ముందు ప్రేమకథ”. తాగుబోతు రమేష్, సత్య, శివ ప్రసాద్, రాకేష్ ల కాంబిణేషన్ లో తెరకెక్కిన కామెడీ సీన్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఈ నెల ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాము, హీరో హీరొయిన్ కెమిస్ట్రీ ఈ పెళ్ళికి ముందు ప్రేమ కధ లో బాగా వర్క్అవుట్ అయ్యింది. ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తున్నాం” అన్నారు.