యువతకు పవన్ పిలుపు!

జల్లికట్టును అరికట్టే దిశగా సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళులు పోరాడుతున్నారు. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న పవన్ ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు పోరాడకూడదని జనవరి 26న వైజాగ్ లో ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీను నిలబెట్టేందుకు ప్రజలతో
కలిసి నిరసన తెలియజేయనున్నారు. యువతను ప్రోత్సహించే దిశగా పవన్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

”గాంధీని ప్రేమిస్తాం. అంబేడ్కర్ ను ఆరాధిస్తాం. సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ.. తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చోం. మెడలు వంచి కూర్చోపెడతాం.. తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే సహించాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోతే తిరగబడతాం.. అన్నది ఆంధ్ర యువత కేంద్రంకి తెలియజెప్పాలి” అంటూ పిలుపునిచ్చారు.