HomeTelugu Trendingఆమెకు సహాయం చేయండి: రాజమౌళి

ఆమెకు సహాయం చేయండి: రాజమౌళి

SS rajamouli request donate

దర్శకుడు ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా సహాయం కోరారు. తనతో పాటు కలిసి పనిచేసిన ఆర్టిస్ట్‌కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘బాహుబులి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె అనేక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేసింది. ఆమె అభిరుచి, అంకిత భావం సాటిలేనివి. కానీ దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్‌ క్యాన్స్‌ర్‌తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్‌ చేస్తున్న కెటో(KETO)ఫండ్‌ రైజింగ్‌కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు దేవిక ఫొటోలను సైతం షేర్‌ చేశారు.

అయితే దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సుమారు రూ.30-40కోట్లు తీసుకునే మీకు 3కోట్లు ఓ లెక్కనా? ఆమె ఆపరేషన్‌కు కావాల్సిన 3కోట్ల రూపాయలను నేరుగా మీరెందుకు సహాయం చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

నా పెళ్లి- విడాకులకు నన్ను కూడా పిలవండి: హిమజ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!