Upcoming Star Hero Movies in Tollywood:
టాలీవుడ్ లో ఇప్పుడు చాలానే Star Hero సినిమాలు విడుదల కి రెడీ అవుతున్నాయి. ఇందులో చాలావరకు సినిమాల థియేట్రికల్ డీల్స్ కూడా.. భారీ మొత్తానికి అమ్ముడు అవ్వడానికి రెడీ అవుతున్నాయి. తాజాగా ఒక్కో సినిమా థియేటర్ రైట్స్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pushpa 2:
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రమే కాక.. నార్త్ లో కూడా ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాల కారణంగా.. సినిమా థియేటర్స్ వాల్యూ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతానికి దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం 90 కోట్లు డీల్ కోట్ చేస్తున్నారు.
Devara:
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా ఆంధ్రప్రదేశ్ (సీడెడ్ కాకుండా) హక్కులు 55 కోట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది.
Vishwambhara:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా డీల్స్ కూడా హోల్సేల్ గా అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా సీడెడ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 60 కోట్లు.. థియట్రికల్ రైట్స్ మీద వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
Game Changer:
శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా డీల్స్ ఇంకా పూర్తవ్వలేదు. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డీల్స్ కొంచెం తక్కువగానే ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ క్రేజ్ బీభత్సంగా ఉన్నప్పటికీ.. ఫాన్స్ కి శంకర్ దర్శకత్వం మీద నమ్మకం చాలా వరకు పోయింది. ఇండియన్ 2 సినిమా తర్వాత ఈ సినిమా మీద అంచనాలు కూడా బాగానే దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు.