చిరు సినిమా నుండి టెక్నీషియన్ ఔట్!

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణలో ప్రధానమైన సినిమాటోగ్రాఫర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఛాయాగ్రహకుడు రవివర్మన్ ఈ సినిమాకు వర్క్ చేయనున్నారని చిత్రబృందం ముందుగా ప్రకటించింది.
అయితే ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి కలిగిందట. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కోసం చిరుతో కలిసి పని చేసిన రత్నవేలుకి మరో ఛాన్స్ రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు వంటి నటులు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.