‘స్టూడెంట్ నెం.1’ కి పదిహేనేళ్లు!

బుల్లితెర నుండి ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో వెండితెరకు పరిచయమయిన దర్శకుడు రాజమౌళి. మొదటి
సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలయ్యి ఈనాటికీ సరిగ్గా పదిహేనేళ్లు
పూర్తయింది. ఈ సంధర్భంగా రాజమౌళి తన మొదటి సినిమా ముచ్చట్లను షేర్ చేసుకున్నారు.
ఈ సినిమా సక్సెస్ లో ఎక్కువ భాగం కథ, కథనాలకు, సంగీతానికి దక్కుతుందని అన్నారు. అయితే
సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా తెరకెక్కించినప్పటికీ.. మరికొన్ని మాత్రం ఏమీ తెలియనివాళ్ళు
తీసినట్లుగా అనిపించాయని అన్నారు. సినిమాలో తారక్ అధ్బుతంగా నటించారు.. కానీ ఆయనకు
చెప్పుకోదగిన సినిమా కాదని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ.. అప్పట్లో కొత్తగా వచ్చిన నన్ను ఆదరించిన
ప్రేక్షకులకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి2’ షూటింగ్ లో
బిజీగా గడుపుతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates