మెగామల్టీస్టారర్ పక్కా ఉంటుందట!

చిరంజీవి, పవన్ కల్యాణ్ లను హీరోలుగా పెట్టి ఓ మెగా మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలో ఓ ఈవెంట్ లో సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అతను అన్నారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేదు. దీంతో ఈ సినిమా ఇక లేనట్లే అనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన సుబ్బిరామిరెడ్డి మెగామల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన కథ సిద్ధమవుతుందని చెప్పారు.

ప్రస్తుతం చిరు, పవన్ కల్యాణ్ లు ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే మెగామల్టీస్టారర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని చెబుతున్నారు. మరి ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో.. లేదో.. చూడాలి!